Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఇంటెలిజెన్స్ కార్యాలయంలో హోం గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న ఎడ్ల కరుణాకర్ గౌడ్ కుటుంబానికి గర్వకారణంగా, ఆయన కుమార్తె ఎడ్ల హర్షిత ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది. ఈ సందర్భంగా, ఆమె ప్రతిభను అభినందిస్తూ మహబూబ్నగర్ లో రీజినల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ శ్రీ టీ. ఆనంద్ రెడ్డి హర్షితను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హర్షిత తల్లిదండ్రులు, బంధువులు, సహోద్యోగులు పాల్గొని ఆమె విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ.. “గ్రామీణ ప్రాంతాల నుండి ఇలాంటి ప్రతిభావంతులు ముందుకు రావడం సమాజానికి ప్రేరణగా నిలుస్తుంది” అని అభినందనలు తెలిపారు. ఎడ్ల హర్షిత తన కృషి, పట్టుదలతో బాగా చదువుకొని వైద్య రంగంలో సమాజ సేవ చేయాలనీ ఆయన కోరారు.
Admin
Abhi9 News