Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ నియోజకవర్గం, బాయమ్మ తోట లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. స్వచ్చమైన పాల వంటి మనసున్న వారు, కుల మతాలకు అతీతంగా ఉండే పాలమూరు లో సైతం వారి మనసులో విష బీజాలు నాటేందుకు, ప్రత్యర్ధులు సిద్ధంగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. పాలమూరు పచ్చగా ఉండాలి, ప్రతి ఒక్కరికీ ప్రజా సంక్షేమం పథకాలు అందాలి, ఎవరైనా ఏ సమస్య తోనైనా నన్ను కలిసినా వారి సమస్యల్ని పరిష్కరించడానికి అన్ని విధాలుగా కృషి చేసి, సమస్య పరిష్కారించాలని. అన్నదే నా ఆశయం. పిల్లలమర్రి వృక్షం ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది అలాంటి మహబూబ్ నగర్ ఖ్యాతిని విస్మరించిన వ్యక్తి పదవులు కోసం అధికారం కోసం మయూరి పార్క్ ను కేసిఆర్ ఇకో పార్క్ అని పేరు మార్చి కొన్ని రకాల చెట్లు నాటినంతనే అభివృద్ధి జరిగినట్లు అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక మొదటి మెడికల్ కాలేజీ మన మహబూబ్ నగర్ కి తెచ్చుకున్న అంటారు. అంతకు ముందు నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు అన్ని రకాల అనుమతులు పూర్తి చేస్తేనే కదా మెడికల్ కాలేజీ వచ్చింది అని ఆయన అన్నారు. తెలంగాణ బాగు కోసం ఉన్నతమైన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలి వచ్చిన వ్యక్తిత్వం నాది. ఉద్యమ నాయకుడిగా ప్రతి ఇంటి గడపకు ఉద్యమాన్ని తీసుకొని వెళ్ళిన చరిత్ర నాది. అసెంబ్లీ సీటు కోసం, లేదా ఎమ్మెల్యే పదవి కోసం లాలూచీ పడే వ్యక్తిత్వం నాకు లేదు అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఉన్నాం. ప్రజలు వారివారి ఇష్ట ప్రకారం ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. నచ్చిన వ్యక్తికీ ఓటు వేసే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, అంబేద్కర్ ఇచ్చిండు ఎవ్వరూ ఇవ్వలేదు. భయపెట్టి ఓట్లను వేయించుకోవడం అంటే అది ధర్మానికి విరుద్ధంగా పోతున్నాం అని లెక్క.అందుకే మీరు ఇచ్చే తీర్పు ప్రజాస్వామ్య వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. ఏ రాజకీయ నాయకుడు అయిన తప్పు చేసిన, మహబూబ్ నగర్ ప్రజలు ఇచ్చే తీర్పు ఒక గుణపాఠం కావాలి. అని ఆయన అన్నారు.అనంతరం బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ ఆజిమ్ సిద్దిక్ బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి 100 మంది కార్యకర్తలతో కలిసి యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరినారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు శ్రీ ఆనంద్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ లక్ష్మణ్ యాదవ్, కౌన్సిలర్ శ్రీమతి స్వప్న లక్ష్మణ్ యాదవ్ , మదీనా మజీద్ కౌన్సిలర్ శ్రీ మోయిన్ అలి, శ్రీ అహ్మద్, శ్రీ బాలస్వామి , శ్రీ కిరణ్, శ్రీ రామస్వామి, శ్రీ నిజాం రాకేష్ , శ్రీ కరీం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Abhi9 News