Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మత్తు పదార్థాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ అన్నారు. బుధవారం ఆయన తన చాంబర్లో నిర్వహించిన మత్తు పదార్థాల నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడుతూ గాంజా ఇతర మత్తు పదార్థాల వల్ల యువత పాడైపోవడమే కాకుండా కుటుంబాలు సైతం ఎన్నో ఇబ్బందులకు గురవుతాయని, అందువల్ల జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో గాంజా ,మత్తు పదార్థాల రవాణా,సరఫరా, వంటివి నూటికి నూరు శాతం అరికట్టాలని తెలిపారు. ఇందుకుగాను అన్ని శాఖల సమన్వయంతో గాంజాతో పాటు, ఇతర మతపదార్థాలను అరికట్టాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకించి అన్ని శాఖలు మత్తుపదార్థాల నివారణ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. జిల్లా ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటివరకు పెద్ద ఎత్తున గాంజా నిల్వ ఉంచటం, రవాణా చేయటం, అమ్మటం వంటి కేసులు తమ దృష్టికి రాలేదని అయితే ఇటీవల రైల్వే స్టేషన్ తదితరచోట్ల చిన్న చిన్న పాకెట్లలో గాంజా వంటివి అమ్ముతున్నట్లు తమ దృష్టికి రాగానే సంబంధిత వ్యక్తులను గుర్తించి పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. గాంజా ఇతర మత్తుపదార్థాల నివారణకు సంబంధిత శాఖల సమన్వయంతో కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.గాంజా ఏ రూపంలో ఉన్న ఉక్కుపాదంతో అణిచివేయాలని ఆయన అన్నారు ఏఎస్పి రాములు, ఎక్సైజ్ సూపరింటిండెంట్ సైదులు, డి ఎఫ్ ఓ సత్యనారాయణ ,డిఎస్పి మహేష్ ,ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Admin
Abhi9 News