Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : సియం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ అర్బన్ మండలానికి చెందిన లబ్ధిదారులకు సియం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా పేద ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేశారని, కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించడం తో పాటు ఐదు లక్షల రూపాయలు ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల అభ్యున్నతికి కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈరోజు 78 మంది లబ్ధిదారులకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశామని, వాటి విలువ 72 లక్షలు ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారే పల్లి సురేందర్ రెడ్డి, ఓబిసి ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు హన్మంతు, ప్రశాంత్, అంజద్, మోసిన్, రషేద్, నాయకులు లీడర్ రఘు, చర్ల శ్రీనివాసులు, మోయిజ్, అశ్వాక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News