Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ధర్నా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా తరలిరాగా సీఎం దిష్టిబొమ్మను ఊరేగించి బస్టాండ్ కూడలిలో దగ్ధం చేశారు అనంతరం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ధర్నా చేపట్టారు సుమారు రెండు గంటలపాటు ఆందోళన చేశారు రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కేసీఆర్ పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సిలిండర్ ధరలు భారీగా తగ్గిస్తామని మహిళలకు రవాణా వసతి రాయితీ కల్పిస్తామని నాగం చెప్పారు ఈ సందర్భంగా ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి తరలి వెళ్లి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు.
Admin
Abhi9 News