Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్నగర్ రూరల్ మండలంలో ఎంపీడీవో కార్యాలయం సమ్మె శిబిరం దగ్గర అర్ధరాత్రి నిరసన తెలిపారు. ఈ నిరసనకు మద్దతుగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కురుమయ్య, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి వి.పద్మ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వి హనుమంతు మాట్లాడుతూ కార్మికుల బతుకులు బత్తలయ్యాయి అన్నారు. 12 రోజులపాటు కార్మికులు సమ్మె చేస్తున్న. పట్టడం లేదా అని ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికులలో దాదాపుగా దళిత వర్గాలకు సంబంధించిన వారు ఉన్నందుకే వీరి పైన వివక్ష చూపుతున్నారా అని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో సిఐటియు టౌన్ నాయకుడు జి రాజ్ కుమార్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పాండు, మండల అధ్యక్షుడు బాల నాగయ్య ఐఎఫ్టియు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రాములు, కార్మికులు జేరిన బేగం సంతోష ఆంజనేయులు ఉషనయ్య రమేషు నాగప్ప కొండప్ప తదితరులు పాల్గొన్నారు
Admin
Abhi9 News