Abhi9 News - క్రైమ్ వార్తలు / జోగులాంబ గద్వాల్ : భర్త బతికుండగానే వితంతు పింఛన్ పొందుతున్నారనే ఆరోపణలతో గద్వాల 36వ వార్డు కౌన్సిలర్ సునీతపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో తన పింఛన్ రద్దు చేయాలని ఆమె కోరడంతో ఈ విషయం బయటపడ్డట్లు తెలుస్తోంది. అయితే, తనకు చదువు రాకపోవడం వల్ల అది ఏ పింఛనో తెలియదని, కేవలం తన ఖాతాలో రూ.2 వేలు జమ అయ్యేవని సునీత వివరణ ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Abhi9 News