Abhi9 News - తెలంగాణ / Hyderabad : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎంజే ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హులైన 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన అందరూ రాజకీయాలకు అతీతంగా చేపట్టిన ఈ శిబిరంలో దరఖాస్తులు చేసుకొని లబ్ధి పొందాలని ఎమ్మెల్యే కోరారు. మొదట లెర్నింగ్ లైసెన్సులు అందజేసిన తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ లైసెన్సులు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను కార్యకర్తల నడుమ ఎమ్మెల్యే కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Admin
Abhi9 News