Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగులంబా గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని శాంతినగర్ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా గాయత్రి గోమాత కు గో ప్రచారక సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు గోమాతకు గ్రాసం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మాణిక్యం వెంకటేశ్వర్లు, మహానంది, రామచంద్రుడు, దొంతు కుమారి, గుంత లక్ష్మి, శోభిత, నర్సిo శాంత, కోట రజిత , చిన్నారులు పాల్గొన్నారు.గోమాతకు చీర కోట రజిత సమర్పించగ డ్రా తీయగా శాంతను వరించినది.
Admin
Abhi9 News