Saturday, 18 April 2026 05:14:41 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

జడ్చేర లలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు బోగీలు... తప్పిన పెను ప్రమాదం...అప్రమత్తమైన రేల్వే అధికారులు

Date : 23 June 2023 05:27 PM Views : 209

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : హైదరాబాద్ నుండి డోన్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు బోగీలు ఒక్కసారిగా విడిపోవడంతో పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల రైల్వే స్టేషన్ లో రెండవ ప్లాట్ ఫామ్ పై నుండి డోన్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు బోగీలు ఒక్కసారిగా విడిపోయాయి. దీంతో రైల్వేస్టేషన్లో ఉన్న ప్రయాణికులు ఈ ఘటనను చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇంజన్ ముందు భాగానికి కొన్ని బోగీలు, వెనక భాగానికి మరికొన్ని బోగీలు విడిపోవడంతో రైల్వే స్టేషన్ అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాగా ట్రైన్ బ్రేకులు వేయడంతో దీంతో భోగిలమధ్య ఉన్న లాక్ ఒక్కసారిగా ఓపెన్ కావడంతో బోగీలు విడిపోయాయి. గమనించిన ట్రైన్ పైలెట్ ఒక్కసారిగా అప్రమత్తమై ట్రైన్ ను నిలిపివేసి మరమ్మతులు నిర్వహించిన అనంతరం విడిపోయిన భోగిలను తిరిగి ట్రైన్ కు తగిలించుకొని డోన్ వైపు వెళ్ళింది. ఇదిలా ఉండగా ఇటీవల ఒడిస్సా రాష్ట్రంలో జరిగిన ఘటన మరొక ముందే తాజాగా జడ్చర్లలో రైలు ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల ప్రజలు భయాందోళనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :