Saturday, 18 April 2026 06:47:29 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

బర్త్‌డే బంప్స్ ఘటనలో సీఐపై బదిలీ వేటు

సీఐని బదిలీ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ

Date : 18 September 2025 08:29 PM Views : 242

Abhi9 News - తెలంగాణ / Hyderabad : హైద‌రాబాద్ : ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ విద్యార్థిపై దాడి ఘ‌ట‌న‌లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై నాచారం సీఐపై ప్ర‌భుత్వం బ‌దిలీ వేటు వేసింది. పుట్టిన రోజున బ‌ర్త్ డే బంప్స్ పేరిట తోటి విద్యార్థులు చేసిన వికృత చేష్ట‌ల‌తో ఓ బాలుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. కొత్త‌పేట‌కు చెందిన విద్యార్థి(14) నాచారంలోని ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్‌లో 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. అయితే ఆగ‌స్టు 29వ తేదీన స‌ద‌రు విద్యార్థి పుట్టిన రోజు కావ‌డంతో.. తోటి ఫ్రెండ్స్ లంచ్ స‌మ‌యంలో స‌ర‌దాగా చేసిన చేష్ట‌ల‌తో ఆ విద్యార్థి మ‌ర్మంగానికి గాయ‌మై ర‌క్త‌స్రావ‌మైంది. విష‌యం తెలుసుకున్న స్కూల్ ప్రిన్సిప‌ల్ హుటాహుటిన బాధిత విద్యార్థిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం పేరెంట్స్‌కు స‌మాచారం అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. విద్యార్థికి స‌ర్జ‌రీ చేయ‌డంతో ప్రాణ‌పాయం త‌ప్పింది. అయితే విద్యార్థి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా దాడి చేసిన విద్యార్థులపై, పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్ల‌క్ష్యం వ‌హించారు. దీంతో నాచారం సీఐని బదిలీ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సీఐ రుద్వేర్ కుమార్ స్థానంలో కొత్త సీఐగా ధనుంజయ్‌ను నియ‌మించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :