Abhi9 News - తెలంగాణ / Hyderabad : ఈ నెల 22వ తేదీ నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆషాఢ బోనాల జాతర ప్రారంభం కానుంది.మొట్టమొదటగా గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. లంగర్ హౌస్లో నిర్వహించే గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపులో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆషాఢ బోనాల ఉత్సవాలతో నెల రోజులపాటు సందడిగా మారనున్నాయి జంట నగరాలు
Admin
Abhi9 News