Thursday, 08 January 2026 02:51:07 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

అలుపెరుగని పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ

బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్

Date : 28 September 2025 12:05 PM Views : 87

Abhi9 News - తెలంగాణ / Hyderabad : తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా తన చివరి క్షణాల వరకు అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ అన్నారు. మహబూబ్ నగర్ నగరం పద్మావతి కాలనీ లో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి వివిధ కుల సంఘ పెద్దలు, నాయకులు, ప్రజాసంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మూడుతరాల పాటు, తెలంగాణ ప్రజల హక్కుల కోసం , సామాజిక న్యాయం కోసం జీవితాంతం కృషి చేశారన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాపూజీ ఎనలేని సేవలను చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో బాపూజీ కీలకపాత్ర పోషించి, సాయుధ పోరాటం నుంచి రాజకీయ పోరాటం చేశారని కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సాధనే లక్ష్యంగా సమాజంలోని ప్రతి వర్గానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని, ఆయన చూపిన మార్గం, విలువలు అందరికీ స్పూర్తిదాయకం కావాలని ఆయన కోరారు. బాపూజీ చరిత్ర భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత డిఇఓ విజయ్ కుమార్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సారంగి లక్ష్మికాంత్, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న , బీసీ జిల్లా నాయకుడు అజయ్ కుమార్ యాదవ్, కవి భీంపల్లి శ్రీకాంత్, నాయి బ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షుడు అశ్విని శేఖర్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ డీకే నాయి, మాజీ సర్పంచ్ మహేష్ గౌడ్, కుమ్మరి సంఘం పట్టణ అధ్యక్షుడు నాగప్ప తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :