Saturday, 18 April 2026 06:46:42 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

సర్వీస్ రివాల్వర్‌నే అమ్మేసిన ఎస్‌ఐ..

Date : 27 November 2025 08:33 AM Views : 189

Abhi9 News - తెలంగాణ / Hyderabad : హైదరాబాద్‌ మహానగరం పరిధిలోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న భానుప్రకాష్‌ వ్యవహారం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. దర్యాప్తు అధికారి చేయకూడని అక్రమాలకు పాల్పడటంతో మొత్తం శాఖ ప్రతిష్ట దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. 2020 బ్యాచ్‌కు చెందిన భానుప్రకాష్‌ ఇటీవల 4 తులాల బంగారం చోరీ కేసును విచారించాడు. రికవరీ చేసిన బంగారాన్ని బాధితులకు అప్పగించకుండా.. త్వరలో ఇస్తా అని నమ్మబలికి, లోక్‌ అదాలత్‌లో ఇరు వర్గాలతో మాట్లాడి కేసును క్లోజ్ చేయించాడు. కానీ కేసు మూసేసిన తర్వాత కూడా బాధితులకు బంగారం ఇవ్వకుండా.. తీసుకెళ్లి తాకట్టు పెట్టుకున్నట్టు విచారణలో తేలింది. విషయం పైస్థాయికి చేరడంతో అతడిపై కేసు నమోదు చేసి, సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతటితో ఆగకుండా.. భానుప్రకాష్‌ మీద మరో పెద్ద షాకింగ్‌ ఆరోపణ వెలుగులోకి వచ్చింది. తనకు కేటాయించిన 9MM సర్వీస్‌ పిస్టల్‌ కనిపించడంలేదని ఇటీవల స్టేషన్‌కు వచ్చి గోల చేశాడు. అతని డ్రా చెక్ చేయగా బుల్లెట్లు మాత్రమే కనిపించాయి. గన్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. సీసీ కెమెరా ఫుటేజీని చెక్ చేస్తే.. రికవరీ చేసిన బంగారాన్ని డ్రాలో పెట్టి తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా లభించాయి. అయితే గన్ సంగతి అడిగితే.. డ్రాలోనే పెట్టా, ఏమైందో తెలియడం లేదని అని భాను ప్రకాష్‌ విచారణలో చెబుతున్నట్టు సమాచారం. ఇదిలావుంటే, విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెట్టింగ్ వ్యసనానికి అలవాటు పడ్డ భాను ప్రకాష్ దాదాపు రూ.70–80 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులతోనే భానుప్రకాష్‌ ఈ అక్రమాలకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. ఈ లోపే ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ఉద్యోగం వచ్చిందని స్టేషన్‌కు వచ్చి చెప్పి, వస్తువులు తీసుకెళ్లిన సందర్భంలోనే పిస్టల్‌ మిస్సింగ్‌ కథ వెలుగులోకి వచ్చింది. ఈ గన్‌ను రాయలసీమ లేదా ఇతర ప్రాంతాల ముఠాలకు అమ్మేశాడా? అన్న కోణంలో టాస్క్‌ఫోర్స్‌ ప్రత్యేక దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రస్తుతానికి రికవరీ సొత్తు దుర్వినియోగంపై భానుప్రకాష్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పిస్టల్‌ మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు..!!

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :