Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇకపై ప్రతి మంగళవారం గుండె వైద్య నిపుణులు( ఫిజీషియన్) అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం అయన మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్ నగర్ వైద్యరంగంలో ఎంతో మార్పులు వచ్చాయని అన్నారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని వైద్య కళాశాలలు ఉన్నాయని, జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉన్న చరిత్ర తెలంగాణకే ఉందని తెలిపారు. 70 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 3 ప్రభుత్వ కళాశాలలు మాత్రమే ఉండేవని, అలాంటిది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేశామని, దీని వల్ల జిల్లాలలో ఆసుపత్రులు అభివృద్ధి చెంది పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుతున్నదని తెలిపారు. కరోనా సమయంలో చాలామంది హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్అయి మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి- హబ్ ద్వారా 134 రకాల పరీక్షలను కార్పొరేట్ తరహాలో ఉచితంగా చేయడమే కాకుండా, అదే రోజు సాయంత్రమే సెల్ ఫోన్ కు టెస్టుల ఫలితాలను తెలియజేయడం జరుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు. గతంలో మహబూబ్ నగర్ ప్రధాన ఆస్పత్రిలో కేవలం 15 మంది డాక్టర్లు మాత్రమే ఉండగా ఇప్పుడు వారి సంఖ్య 130 నుండి 140 పెరిగిందని, ఒక ల్యాబ్ టెక్నీషియన్ నుండి 43 మందికి, ఒక ఫార్మసిస్టు నుండి 40 మందికి, 30 మంది నరుసుల నుండి 350 వరకు పెంచడంతోపాటు, అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని , ఇటీవలే రేడియాలజీ హబ్ ప్రారంభించామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ప్రధానాస్పత్రికి కార్డియాలజీ పోస్టు మంజూరైనందున శాశ్వత డాక్టర్ నియామకానికి కృషి చేస్తున్నామని, అయితే పాత కలెక్టర్ స్థానంలో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ వైద్యశాల త్వరలోనే పూర్తికానున్నందున క్యాథ్ ల్యాబ్ తో పాటు, నూతన ఎంఆర్ఐ యంత్రాలను అక్కడ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. అప్పటివరకు పూర్వపు నిమ్స్ డైరెక్టర్ డి ప్రసాద్ రావు సహకారంతో ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో ప్రతి మంగళవారం ఒక గుండె వైద్య నిపుణులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, అవసరమైతే వారంలో మరో రెండు రోజులపాటు వీరిని ఇక్కడే పొదగించే విధంగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. భవిష్యత్తులో మహబూబ్ నగర్ ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల వైద్యానికి ఇక్కడికి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని, అన్ని రకాల జబ్బులకు ఇక్కడే వైద్యాన్ని అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్, ముడా చైర్మన్ గంజి వెంకన్న , నిమ్స్ మాజీ డైరెక్టర్ డి. ప్రసాద్ రావు ఆస్పత్రి సూపరిన్టెండెంట్ డాక్టర్ డాక్టర్ రామ్ కిషన్ ,డిప్యూటీ ఆర్ ఎం ఓ, డాక్టర్ జీవన్, మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, ఉపవైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్, హైదరాబాద్ నుండి వచ్చిన గుండె వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్, ఆసుపత్రి సలహ సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రి ఆవరణలో మొక్కలను నాటారు.
Admin
Abhi9 News