Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : నారాయణపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు ఉన్న టింబర్ డిపో లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన బాణసంచా పేల్చడంతో నిప్పురవ్వలు పడి మంటలు అంటుకున్నట్లు బాధితులు తెలిపారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పివేశారు. అగ్నిప్రమాదంలో కట్టెలు, యంత్రాలు పూర్తిగా దగ్దమయ్యాయి. సుమారు 35 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు చెప్పారు.
Admin
Abhi9 News