Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ఇస్రంపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరిట లబ్ధిదారుల నుండి 25 వెల రూపాయలు అక్రమవాసులు చేస్తున్నారని గ్రామస్తులు దేవరకద్ర లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు... సర్పంచ్ శివరాజ్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని డబ్బులు ఇస్తేనే కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలు వస్తాయని లేకుంటే ఏదో ఒక కారణం చెప్పి గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఆరోపించారు. సర్పంచి చేసే అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టిస్తున్నరని అన్నారు.దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడే BRS నాయకులను అదుపులో ఉంచుకోవాలని లేకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామన్నారు.ఇస్రంపల్లి గ్రామ ప్రజలకు కలిసి తన మద్దతును తెలియజేసిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మధుమసూదన్ రెడ్డి.ఈ సందర్బంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అత్యంత అవినీతిపరుడు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అని, చెక్ డ్యామ్ ల పేరు మీద ఇసుక దందా చేస్తున్నారని విమర్శించారు. చివరకు ఎల్ఓసిలో కూడా ఎమ్మెల్యే కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.గ్రామ ప్రజలకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని తెలియజేశారు.
Admin
Abhi9 News