Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్ర సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తా దగ్గర గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ గోశాలలో ఈనెల 7న ఆషాడ మాసం పంచమి తిథి ,శుక్రవారం రోజు ఉదయం 8 గంటల నుండి సామూహిక గోపద్మ వ్రతం గోశాలలో నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షులు ఆకారపూ విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్యలు తెలిపారు. ఈ గోపద్మా వ్రతం గోశాలలో 40 గోవులకు సామూహికంగా వేద బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా వేదమంత్రచరణల మధ్య నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ వ్రతం చాతుర్మస్య వ్రతంలో ఒక భాగమని, ఈ వ్రతాన్ని ఆచరించడంతో సకల యజ్ఞాలు, పూజలు చేసిన విశేష ఫలితం ఉంటుందని అన్నారు. జన్మ రిత్యా గ్రహదోషాలు తెలుగుటకు, వివాహ, సంతాన ,ఆర్థిక, వ్యాపార ఇబ్బందులు తొలుగుటకు భక్తులు అధిక మొత్తంలో పాల్గొనాలని కోరారు.ఈ వ్రతంలో పాల్గొనేవారు పూలు మూరలు రెండు, అరడజన్ పండ్లు, తమలపాకులు 10, కిలోన్నర బియ్యం, కుడకలు5, వక్కలు5, ఖర్జూర పండ్లు5, రవికే గుడ్డలు రెండు, టెంకాయలు రెండు, వత్తి పత్తి,అగరు బత్తీ లతో వెంట తీసుకొని వచ్చి పూజకు హాజరు కాగలరని కోరారు.పాల్గొనే భక్తుల పేరిట సంకల్పం చెప్పనున్నట్లూ తెలిపారు అనంతరం ఆలయ కమిటీ వారిచే పాల్గొన్న భక్తులందరికీ భోజన వసతి ఉందన్నారు.
Admin
Abhi9 News