Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాహనదారులకు గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ గారి యొక్క విజ్ఞప్తి.వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా నడపాలి. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి అని తెలియజేసారు.రోడ్లు వర్షంతో తడిసి ఉండటం ద్వారా వాహనం నడిపేవారు అతివేగంగా వెళ్లడం ద్వారా వాహనం అదుపుతప్పి కిందకు పడి గాయాలు అయ్యే అవకాశం ఉంది కావున వాహనం నిదానంగా నడపవలెను.వాహనం నడిపే సమయంలో రోడ్డుపై ఉన్న నీటి దగ్గర నిదానంగా వెళ్ళవలెను ఎందుకంటే నడుచుకుంటూ వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలవకుండా చూసుకోవాలి. అత్యవసర సమయాల్లో 100 కి కాల్ చేయాలన్నారు.
Admin
Abhi9 News