Saturday, 13 June 2026 05:26:15 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

అసత్యపు ఆరోపణలు చేయడం మానుకోవాలి.... మరికల్ మండల విజిలెన్స్ కమిటీ సభ్యులు కొత్తపల్లి రాజేందర్ రెడ్డి

Date : 17 July 2023 04:15 PM Views : 351

Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : నియోజకవర్గ ఎమ్మెల్యే పై అసత్యపు ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీ టిపిసిసి గాలి హర్షవర్ధన్ రెడ్డి మానుకోవాలని మరికల్ మండల విజిలెన్స్ కమిటీ సభ్యులు కొత్తపల్లి రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా మరికల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ పై పేట ఎమ్మెల్యే ఎలాంటి ఆరోపణలు చేయలేదని ఆయన వివరించారు. ఖమ్మంలో అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే జరిగిందని ఆయన వివరించారు. కొత్తపల్లి గ్రామంలో సిసి రోడ్లు, సబ్స్టేషన్, మిషన్ భగీరథ పైప్లైన్ పనులు, మిషన్ కాకతీయ వాటర్ ప్లాంట్ బీటి రోడ్డు మాధవరం నుండి కొత్తపల్లికి నూతనంగా బీటీ రోడ్డు వేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా పెద్ద చింతకుంట స్టేజి నుండి కొత్తపల్లి గ్రామం వరకు బీటి రోడ్డు వేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీకి దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలి హర్షవర్ధన్ రెడ్డి గారు గ్రామంలో తిరిగిన తర్వాతనే మాట్లాడాలన్నారు. అబద్ధాలు మాట్లాడితే జోకర్గా మిగిలిపోతారని ఆయన ఆరోపించారు. ఇకనైనా తెలుసుకొని మాట్లాడడానికి నేర్చుకోవాలని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అప్పంపల్లి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పేట ఎమ్మెల్యే పై ప్రభుత్వం పై లేని ఆరోపణలు చేయడం గాలి హర్షవర్ధన్ రెడ్డి గారు మానుకోవాలని ఆయన గుర్తు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నారాయణపేట జడ్పీ వైస్ చైర్మన్ సురేఖ, మండల వైస్ ఎంపీపీ రవికుమార్, మరికల్ గ్రామ సర్పంచ్ గోవర్ధన్, మాజీ సర్పంచ్ రామస్వామి, మరికల్ పట్టణ అధ్యక్షుడు సురిటి చంద్రశేఖర్ , కృష్ణయ్య, బాలకృష్ణ, పి. రఘు, నర్సింలు, మైనార్టీ నాయకులు జంగల్ సాహెబ్ ,బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాజేష్, రాజారెడ్డి ,బుచ్చన్న డేవిడ్ ,సుదర్శన్ రెడ్డి ,సత్తన్న ,తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :