Saturday, 18 April 2026 05:11:03 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

రాష్ట్రంలో గ్రామాలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయి రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్

Date : 15 June 2023 05:45 PM Views : 216

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : రాష్ట్రంలో గ్రామాలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం మహబూబ్ నగర్ జిల్లా ,హన్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.హన్వాడ మండలాన్ని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన కరివేన రిజర్వాయర్ ద్వారా సస్యశ్యామలం చేస్తామని, నియోజకవర్గంలోని ప్రతి చెరువును, కాలువను నింపి సాగునీరు అందిస్తామని అన్నారు. పాలమూరు -రంగారెడ్డి పూర్తి అయితే మహబూబ్నగర్ నియోజకవర్గం మొత్తం సస్యశ్యామలం అవుతుందని ,అలాగే హన్వాడ మండలంలో ఇదివరకే కొన్ని చెక్ డ్యాములు నిర్మించగా, మరో నాలుగు కొత్తగా మంజూరయ్యాయని ,దీంతోపాటు, అన్ని గ్రామాలలో రోడ్లు వేయడం జరిగిందని, ప్రతి గ్రామానికి ట్రాక్టర్, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు ఇచ్చామని తెలిపారు. మండలంలోని కోనగంటి పల్లి గ్రామం పల్లె ప్రగతి కార్యక్రమాలను బాగా అమలు చేసి అవార్డును సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.హన్వాడ మండలంలో తెలంగాణ రాకముందు పెన్షన్ల కింద సంవత్సరానికి కొటి 30 లక్షలు ఇస్తే ,ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తాము హన్వాడ లో నెలకు కోటి 33 లక్షలు ఇస్తున్నామని, పెన్షన్ల రూపేనా మండలంలో సంవత్సరానికి 130 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. 1626 మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్ఛామని ,రైతుబంధు కింద 15,539 మందికి 133 కోట్లు ఇచ్చామని, 271 మంది రైతులు చనిపోతే ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున వారి కుటుంబాలకు ఇచ్ఛామని, 111 కోట్లు స్వయం సహాయక మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చామని ,తాగునీటి కోసం 35 కోట్లు ఖర్చు చేశామని, ఇప్పుడు ఇంటి ముందరికే త్రాగునీరు, కెసిఆర్ కిట్ వంటివి వస్తున్నాయని, మండలంలో ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, అన్ని హాస్టల్లో ఏర్పాటు చేశామని, మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామని, త్వరలోనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ,ఐటీ పార్కు, ఫుడ్ పార్క్ ద్వారా యువతకు ఉన్నచోటనే ఉపాధి కల్పిస్తామని తెలిపారు.ఎంపీపీ బాలరాజు, జెడ్పిటిసి విజయనిర్మల, డిపిఓ వెంకటేశ్వర్లు, డి ఆర్ డి ఓ యాదయ్య, ఆర్డీవో అనిల్ కుమార్, ఏపీ డి శారద తాహసిల్దార్ బక్కశ్రీనివాసులు, ఎంపీడీవో ధనంజయ గౌడ్, సర్పంచ్ రేవతి, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మండలస్థాయి నాయకులు బాలయ్య, లక్ష్మయ్య, పిఎసిఎస్ అధ్యక్షులు వెంకటయ్య, కరుణాకర్ గౌడ్, ఎంపీటీసీ సత్యమ్మ ,తదితరులు ఉన్నారు...ఈ సందర్బంగా మంత్రి డ్వాక్రా స్టాల్ ను సందర్శించారు.జాతీయ స్థాయి లో అవార్డ్ పొందిన కొనగట్టు పల్లి సర్పంచుతో పాటు,ఇతర సర్పంచులు,ప్రజా ప్రతినిధులను సన్మానించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :