Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కోడెర్ మండలం పస్ఫుల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భర్త అత్తమామల వరకట్న వేధింపులతో ఓ నిండి గర్భిణీ బాలమణి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్తమామలు వరకట్న వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. భర్త తరుణ్ ఇంటి ముందు మృత దేహంతో ధర్నాకు కూర్చున్నారు.
కోడేరు గ్రామానికి చెందిన బాలమణి, పస్ఫుల గ్రామానికి చెందిన తరుణ్ 8 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయి కులాంతర వివాహం చేసుకున్నారు. కానీ భర్త తరుణ్ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని భార్య బాలమణి ని వేధింపులకు గురి చేశారు. మా కులం అమ్మాయిని పెండ్లి చేసుకుంటామని, వరకట్న తీసుకరావాలని వేధింపులకు గురి చేశారని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. దాంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. భర్త, అత్తమామలు పరారీలో ఉన్నారు. గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పటు చేశారు. కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ యాలాద్రి తెలిపారు.
Admin
Abhi9 News