Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : రూర్బన్ పథకం కింద గండీడ్ మండలంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సమయంలోని తన ఛాంబర్ లో పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డితో కలిసి గండీడ్ మండలంలో చేపట్టిన రూర్బన్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ఇంకా మొదలుపెట్టని పనులను వెంటనే ప్రారంభించాలని, పురోగతిలో ఉన్న పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు . మొదలుపెట్టని పనులలో విద్యుత్ కనెక్షన్లు, ఉద్యాన పందిళ్లు ,పంచాయతీరాజ్ ,టి ఎస్ ఈడబ్ల్యుసి కి సంబంధించిన పనులు పెండింగ్ లో ఉన్నాయని, సంబంధిత శాఖ ఇంజనీరింగ్ అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న విద్యుత్ కనెక్షన్లను వెంటనే ఇప్పించాలని, అలాగే వ్యవసాయ మోటార్లను విద్యుదీకరించాలని ఆదేశించారు. పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ గోదాము,దాల్ మిల్, విద్యుత్ కనెక్షన్లు, ఇటీవల ప్రారంభించిన మిల్క్ చిల్లింగ్ సెంటర్లో సదుపాయాల కల్పనను వెంటనే పూర్తి చేయాలని కోరారు. అలాగే ఈ- పంచాయతీకి సంబంధించి అవసరమైన సిస్టమ్స్ ని ఏర్పాటు చేయాలని అన్నారు.కష్టం హైరింగ్ సెంటర్లకు లబ్ధిదారులను గుర్తించి సాధ్యమైనంత త్వరగా వాటిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. డి ఆర్ డి ఓ యాదయ్య,ఆటవిశాఖ అధికారి సత్యనారాయణ, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, రెడ్కో డిఎం, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిడి, పంచాయతీరాజ్ ఈ ఈ, మార్కెటింగ్ శాఖ ఇంజనీర్, ఎలక్ట్రిసిటీ డి ఈ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Admin
Abhi9 News