Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : నారాయణ పేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్ లో పిడిఎస్ యు జిల్లా ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు సాయికుమార్ అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి సిపిఐ(ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి బి.రాము ప్రారంబోపన్యాసం చేయగా పిడిఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు పి.రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎన్,అజాద్ లు మాట్లాడటం జరిగింది. PYL రాష్ట్ర అధ్యక్షుడు కే కాశీనాథ్ ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్, జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్, హన్మంతు,సంధ్య,సహాయ కార్యదర్శి బాలు, కోశాధికారి వెంకటేష్,జిల్లా నాయకులు విజయ్,మల్లేష్,మౌనిక, కురుమూర్తి,చంద్రశేఖర్,నాయకులు విశాల,రవి,సాయి,భాస్కర్, బిమేష్ తో పాటు జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News