Saturday, 18 April 2026 06:45:16 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్!

తెలంగాణలోరి నిరుద్యోగులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే వారు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఉద్యోగ నియామకాల ప్రక్రియ త్వరలోనే మొదలు కానుంది. అ

Date : 31 December 2025 09:09 AM Views : 177

Abhi9 News - తెలంగాణ / Hyderabad : రాష్ట్రంలో రోజురోజుకూ నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరం డిగ్రీ పట్టాలు పొంది బయటకు వస్తున్న విద్యార్థులకు సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఎందరో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పోలీస్‌ శాఖలోని ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. పోలీస్ శాఖకు సంబంధించి 14 వేల స్టయిపెండరీ క్యాడెట్ కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర సర్వీసులకు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. డీజీపీ కీలక ప్రకటన హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం జర్నలిస్ట్‌లతో జరిగిన సమావేశంలో ఆయన కీలక ప్రకటన చేశారు. పోలీస్ శాఖలో త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసిందని.. నిరుద్యోగులకు కొత్త సంవత్సరం కానుకగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ వచ్చాక ఎన్ని నోటిఫికేషన్ వచ్చాయ్! తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మూడు సార్లు పోలీసు ఉద్యోగాల భర్తీ జరిగింది. కానీ 2023 నుంచి ఉద్యోగాల భర్తీలో కస్తా జాప్యం నెలకొంది. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగులు ఒత్తిడి తీసుకురావడం స్టార్ట్ చేశారు. దీనికి తోడు పోలీస్ శాఖలో ప్రతి ఏడాది పదవి విరమణ పొంతున్న వారి సంఖ్య పెరుగడం, కొత్త సిబ్బంది నియామకం లేకపోవడంతో ఉన్న పోలీసులపై పనిభారం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులపై భారం తగ్గించి వారి పనితీరును మెరుగు పర్చేందుకు.. శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్దమైంది.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :