Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : జడ్చర్ల నియోజకవర్గంలో అభివృద్ధి కంటే భూకబ్జాలే ఎక్కువయ్యాయని టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆరోపించారు.. నియోజకవర్గంలో తాను చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర సోమవారం 9వ రోజు బాలానగర్ మండలంలో కొనసాగుతోంది ఈ సందర్భంగా ప్రజలు, యువత ఆయన వెంట నడుస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు.. అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ... తాను పాదయాత్ర చేపట్టిన ప్రతి గ్రామం ప్రతి తండాల్లో ఎక్కడ చూసినా అభివృద్ధి శూన్యమని, రోడ్లు గుంతలు, డ్రైనేజీలు అధ్వానంగా మారాయని చెప్పారు... బిఆర్ఎస్ నాయకులు జడ్చర్ల నియోజకవర్గంలో, విపరీతంగా భూకబ్జాలు అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు... వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భూకబ్జాలు అక్రమ కట్టడాలు రూపుమాపతామని తెలిపారు...
Admin
Abhi9 News