Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామం లోని పంప్ హౌస్ ఫేస్ - 1 దగ్గర కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి జెడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూజూరాల నుంచి వుంద్యాల పంప్ హౌస్ పేజ్ - 1 నుంచి లిఫ్ట్ ద్వారా కోయిల్ సాగర్ కు తాగు నీటి కోసం విడుదల చేసుకోవడం జరిగింది.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వర్షాలు రావడం లేటు అయినందున తాగునీటికీ ఇబ్బంది కలుగకుండా ముందుచూపుతో జురాలకు ఇన్ ప్లో లేనందు వల్ల ఈ రోజు ఒక్క మోటారు ద్వారా నీటిని తాగునీటి అవసరాలకు కోయిల్ సాగర్ కు విడుదల చేసుకోవడం జరిగింది . ఇంకో వారంలో వర్షాలు ఎక్కువగా పడితే రెండో మోటార్ ను ప్రారంభించి పర్దిపూర్ రిజర్వాయర్ ను నింపుతామని తెలిపారు.
Admin
Abhi9 News