Abhi9 News - తెలంగాణ / Hyderabad : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కార్పొరేషన్ మరియు మునిసిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన బీసీలకు బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ ఒక ప్రకటనలో అభినందనలు తెలియజేశారు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా మంది బీసీలు కార్పొరేటర్ లుగా,వార్డు మెంబర్లుగా గెలుపొందడం బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల పాత్ర ఎంతో ఉందని జనరల్ స్థానాలలో మెజారిటీ బీసీ లు గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ మరియు మునిసిపాలిటీ ఎన్నికల్లో బీసీలు తమ ప్రతాపాన్ని చూపెట్టి అత్యధిక స్థానాలు గెలవడం చూస్తే భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ముందుకు వెళ్లి తమ బలాన్ని చూపెట్టి అధికార దిశగా ముందుకు వెళ్తామని శ్రీనివాస్ సాగర్ తెలిపారు.
Admin
Abhi9 News