Abhi9 News - తెలంగాణ / వనపర్తి : ముఖ్యమంత్రి కేసీఆర్ గద్వాల జిల్లా పర్యటన కు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వెళ్తున్న క్రమంలో బెంగుళూరు హై వే లో వనపర్తి జిల్లా పెద్ద మందడి వద్ద బొలెరో వాహనం ప్రమాదానికి గురై బ్రిడ్జి మీదుగా కిందపడింది తీవ్ర గాయాలైన బాధితులకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తో పాటు సహాయంగా నిలిచారు. తక్షణమే అంబులెన్స్ కు, స్ధానిక పోలీస్ ల తో మాట్లాడి సహాయక చర్యలు తీసుకోవాలని అదేశించారు. రోడ్డు పై తీవ్ర గాయాలైన కార్మికురాలను తోడ్కొని ఆటో లో ఎక్కించి ఆసుపత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటారు. అక్కడ ఉన్న వారందరూ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ చేపట్టిన సహాయక చర్యలు పట్ల అభినందనలు తెలియజేశారు...
Admin
Abhi9 News