Saturday, 18 April 2026 06:41:37 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం : ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Date : 20 June 2025 07:09 PM Views : 224

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు పేర్కొన్నారు. మహబూబ్ నగర్ పట్టణం లోని శిల్పారామం వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదటి వేస్ట్ మేనేజ్మెంట్ మీద స్టార్టప్ సమ్మిట్ జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లో నిష్ణాతులైన వారు ఈరోజు ఒక రోజు సెమినార్ లో పాల్గొన్నారని ఆయన చెప్పారు. 40 స్టార్టప్స్ వచ్చాయని, వారు చేసిన ఆవిష్కరణలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు. పట్టణీకరణ అభివృద్ధి చెందడంతో పాటుగా నగర ప్రాంతాలలో వేస్టేజ్ కూడా అధికంగా పెరుగుతుందని ఆయన చెప్పారు . వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యము అర్బన్ వేస్టేజ్ వలన అవుతుంది అని ఆయన అన్నారు. పెరుగుతున్న కాలుష్యం ద్వారా వివిధ రకాల చెడు బ్యాక్టీరియా లు మన ఆరోగ్యానికి హాని చేస్తున్నాయని, చిన్నపిల్లలకు కూడా వాయు, నీటి కాలుష్యం ద్వారా ఇన్ఫెక్షన్స్ కలుగుతున్నాయని ఆయన చెప్పారు. వీటిని తగ్గించుట కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ తో కలిసి ఎటువంటి స్కీమ్స్ అమలు చేస్తే నీటి కాలుష్యము , వాయు కాలుష్యము తగ్గించే అవకాశం ఉంటుందో వాటిని తప్పకుండా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ వచ్చిన స్టార్టప్ లపైన పూర్తిగా అధ్యాయనం చేసి తప్పకుండా మన మహబూబ్ నగర్ నగరపాలక సంస్థకు అవసరమైన వాటిని వినియోగించుకుంటాం అని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు స్టాల్స్ ను ఆయన ప్రారంభించి సందర్శించి, వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంయుఐడి కమీషనర్ టికె శ్రీదేవి, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :