Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : గ్రామపంచాయతీ భవనాల నిర్మాణంలో భాగంగా జిల్లాలో మంజూరైన గ్రామ పంచాయతీ భవనాలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇదివరకే స్థలాలను అప్పగించినందున భవనాల నిర్మాణంపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీడీవోలను, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం అయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఇంజనీరింగ్ అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా వర్షాలు ప్రారంభమైనందున 15 రోజుల్లో గుంతల తవ్వకాన్నీ పూర్తి చేసి నెలాఖరునాటికి మొక్కలు నాటడాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా గ్రామాల వారిగా ఎలాంటి మొక్కలు నాటుతున్నారు... అదేవిధంగా మొక్కలు నాటేందుకు గుర్తించిన స్థలాల వంటి వాటితో పూర్తి కార్యాచరణ ప్రణాళికను సమర్పించాల్సిందిగా ఆదేశించారు.అంతేకాక నీటిపారుదల శాఖ ద్వారా సంపద వనాల పెంపుకై చెరువు, రిజర్వాయర్ల గట్లపై మొక్కలు నాటడం, కెనాల్స్ ఫై మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని వీటికి గుంతల తవ్వకాన్ని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్టిమేషన్ జనరేషన్ పై సైతం దృష్టి సాధించాల్సిందిగా చెప్పారు. గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం పై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ మంజూరైన అన్ని గ్రామపంచాయతీ భవనాలు పురోగతిలోకి తీసుకురావాలని, ఇంకా పనులు మొదలు పెట్టని చోట తక్షణమే మార్కింగ్ ఇచ్చి పనులు ప్రారంభించాల్సిందిగా ఆదేశించారు. ఎక్కడైనా స్థలం లేని చోట అటవీ భూములు తీసుకున్నట్లయితే వాటికి సంబంధించి ప్రతిపాదన పంపించాలని చెప్పారు. తప్పనిసరిగా ప్రతి గ్రామపంచాయతీలో గ్రామపంచాయతీ భవనం ఉండి తీరాలని అన్నారు. స్థానిక సర్పంచుల సమన్వయంతో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం పూర్తికి చొరవ తీసుకోవాలని ఎం పి డి ఓ ల ను ఆదేశించారు.వైకుంఠధామాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నీరు, విద్యుత్ సౌకర్యం, రహదారి సౌకర్యం తదితర అన్ని సౌకర్యాలను కల్పించాలని ,ఇప్పటివరకు మొత్తం 439 వైకుంఠధామాల నిర్మాణానికి గాను దాదాపుగా అన్ని పూర్తికాగా, చిన్న చిన్న పనులు మాత్రం మిగిలిపోయాయిలని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ఆ సౌకర్యాలను కల్పించాలని చెప్పారు. సోలార్ లైట్లున్నచోట సోలార్ లైట్లు వినియోగించుకోవాలని ,లేనిచోట ప్రత్యామ్నాయ మార్గం చూడాలని అన్నారు.గ్రామాలలో దహన సంస్కారాలన్నీ వైకుంఠధామాలలో జరిగే విధంగా ప్రజలను చైతన్యం చేయాలని చెప్పారు.వెనుకబడిన కులాల ఆర్థిక చేయూత కార్యక్రమం కింద జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులన్నింటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలించి అప్లోడ్ చేయాలని చెప్పారు. వీటన్నిటిని జాగ్రత్తగా పరిశీలించాలని అన్నారు. ఎట్టి పరిస్థితులలో అనర్హులు జాబితాలో రాకూడదని, అదేవిధంగా అర్హులు జాబితాలో నుండి తొలగింపబడకూడదని స్పష్టం చేశారు.స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా జూలై 15 నుండి కేంద్ర బృందం పరిశీలన నిమిత్తం జిల్లాకు రానున్నదని,ఎంపిక చేసిన 11 గ్రామపంచాయతీలలో టాయిలెట్ల నిర్మాణం, సోక్ పిట్ల నిర్మాణం, శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ,ఒకవేళ ఎక్కడైనా లేనట్లు ఉంటే ఒకటి,రెండు రోజులలో వీటి మంజూరు ని తీసుకొని పనులు ప్రారంభించి రెండు రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు.తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు 266 క్రీడ ప్రాంగణాలు పూర్తి చేయగా, 302 క్రీడా ప్రాంగణాలకు స్థలము అప్పగించడం జరిగిందని, తక్కిన వాటిలో తక్షణమే సంబంధిత క్రీడా సామాగ్రిని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీడీవోలను ఆదేశించారు. మరోసారి క్రీడా ప్రాంగణాలను వందకు వందశాతం పూర్తి చేసే విషయంలో ఎంపీడీవో, తహసిల్దార్లు సంయుక్తం గా సమావేశం ఏర్పాటు చేసుకొని ఇంకా స్థలాలు చూడనిచోట వెంటనే స్థలాలను గుర్తించి వాటిని పూర్తిచేసే విషయంపై దృష్టి సారించాల్సిందిగా చెప్పారు. ఆ గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్థలాలన్నింటిని క్రీడా ప్రాంగణాలకు వినియోగించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.రెవిన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ యాదయ్య, జెడ్పి సీఈవో జ్యోతి, పంచాయతీరాజ్ ఎస్ ఈ శివకుమార్,ఈ ఈ నరేందర్ రెడ్డి, మిషన్ భగీరథ ఈ ఈ పుల్లారెడ్డి, ఇతర అధికారులు, తదితరులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. మంగళవారం అయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఇంజనీరింగ్ అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా వర్షాలు ప్రారంభమైనందున 15 రోజుల్లో గుంతల తవ్వకాన్నీ పూర్తి చేసి నెలాఖరునాటికి మొక్కలు నాటడాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా గ్రామాల వారిగా ఎలాంటి మొక్కలు నాటుతున్నారు? అదేవిధంగా మొక్కలు నాటేందుకు గుర్తించిన స్థలాల వంటి వాటితో పూర్తి కార్యాచరణ ప్రణాళికను సమర్పించాల్సిందిగా ఆదేశించారు.అంతేకాక నీటిపారుదల శాఖ ద్వారా సంపద వనాల పెంపుకై చెరువు, రిజర్వాయర్ల గట్లపై మొక్కలు నాటడం, కెనాల్స్ ఫై మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని వీటికి గుంతల తవ్వకాన్ని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్టిమేషన్ జనరేషన్ పై సైతం దృష్టి సాధించాల్సిందిగా చెప్పారు. గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం పై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ మంజూరైన అన్ని గ్రామపంచాయతీ భవనాలు పురోగతిలోకి తీసుకురావాలని, ఇంకా పనులు మొదలు పెట్టని చోట తక్షణమే మార్కింగ్ ఇచ్చి పనులు ప్రారంభించాల్సిందిగా ఆదేశించారు. ఎక్కడైనా స్థలం లేని చోట అటవీ భూములు తీసుకున్నట్లయితే వాటికి సంబంధించి ప్రతిపాదన పంపించాలని చెప్పారు. తప్పనిసరిగా ప్రతి గ్రామపంచాయతీలో గ్రామపంచాయతీ భవనం ఉండి తీరాలని అన్నారు. స్థానిక సర్పంచుల సమన్వయంతో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం పూర్తికి చొరవ తీసుకోవాలని ఎం పి డి ఓ ల ను ఆదేశించారు. వైకుంఠధామాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నీరు, విద్యుత్ సౌకర్యం, రహదారి సౌకర్యం తదితర అన్ని సౌకర్యాలను కల్పించాలని ,ఇప్పటివరకు మొత్తం 439 వైకుంఠధామాల నిర్మాణానికి గాను దాదాపుగా అన్ని పూర్తికాగా, చిన్న చిన్న పనులు మాత్రం మిగిలిపోయాయిలని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ఆ సౌకర్యాలను కల్పించాలని చెప్పారు. సోలార్ లైట్లున్నచోట సోలార్ లైట్లు వినియోగించుకోవాలని ,లేనిచోట ప్రత్యామ్నాయ మార్గం చూడాలని అన్నారు.గ్రామాలలో దహన సంస్కారాలన్నీ వైకుంఠధామాలలో జరిగే విధంగా ప్రజలను చైతన్యం చేయాలని చెప్పారు. వెనుకబడిన కులాల ఆర్థిక చేయూత కార్యక్రమం కింద జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులన్నింటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలించి అప్లోడ్ చేయాలని చెప్పారు. వీటన్నిటిని జాగ్రత్తగా పరిశీలించాలని అన్నారు. ఎట్టి పరిస్థితులలో అనర్హులు జాబితాలో రాకూడదని, అదేవిధంగా అర్హులు జాబితాలో నుండి తొలగింపబడకూడదని స్పష్టం చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా జూలై 15 నుండి కేంద్ర బృందం పరిశీలన నిమిత్తం జిల్లాకు రానున్నదని,ఎంపిక చేసిన 11 గ్రామపంచాయతీలలో టాయిలెట్ల నిర్మాణం, సోక్ పిట్ల నిర్మాణం, శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ,ఒకవేళ ఎక్కడైనా లేనట్లు ఉంటే ఒకటి,రెండు రోజులలో వీటి మంజూరు ని తీసుకొని పనులు ప్రారంభించి రెండు రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు 266 క్రీడ ప్రాంగణాలు పూర్తి చేయగా, 302 క్రీడా ప్రాంగణాలకు స్థలము అప్పగించడం జరిగిందని, తక్కిన వాటిలో తక్షణమే సంబంధిత క్రీడా సామాగ్రిని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీడీవోలను ఆదేశించారు. మరోసారి క్రీడా ప్రాంగణాలను వందకు వందశాతం పూర్తి చేసే విషయంలో ఎంపీడీవో, తహసిల్దార్లు సంయుక్తం గా సమావేశం ఏర్పాటు చేసుకొని ఇంకా స్థలాలు చూడనిచోట వెంటనే స్థలాలను గుర్తించి వాటిని పూర్తిచేసే విషయంపై దృష్టి సారించాల్సిందిగా చెప్పారు. ఆ గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్థలాలన్నింటిని క్రీడా ప్రాంగణాలకు వినియోగించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ యాదయ్య, జెడ్పి సీఈవో జ్యోతి, పంచాయతీరాజ్ ఎస్ ఈ శివకుమార్,ఈ ఈ నరేందర్ రెడ్డి, మిషన్ భగీరథ ఈ ఈ పుల్లారెడ్డి, ఇతర అధికారులు, తదితరులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.
Admin
Abhi9 News