Saturday, 18 April 2026 06:51:59 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

వృద్ధులు,దివ్యాంగుల అర్జీలను సత్వరం పరిష్కరించాలి -జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

Date : 11 June 2025 09:00 PM Views : 182

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : వృద్ధులు,దివ్యాంగుల సమస్యలను జాప్యం చేయకుండా సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. స్థానిక అర్భన్ తహశీల్దార్ కార్యాలయంలో ప్రతి నెల మొదటి బుధవారం జరిగే వృద్ధుల,దివ్యాంగుల ప్రజావాణి కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వలన రెండో బుధవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని 32 మంది ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా మొదటి బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సంబంధింత అధికారులతో సమస్యలు తప్పక పరిష్కారమవుతాయని కలెక్టర్ భరోసా కల్పించారు. ఈ సంధర్భంగా ఒక వయో వృద్ధుడు తన కుమారుడు తనను ఇంటి నుండి గెంటేశాడని,తనను ఆదుకోవాలని కోరాడు.ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అర్హులైన దివ్యాంగులకు 5 శాతం కేటాయించాలని, డబుల్ బెడ్ రూం ఇళ్ళను కేటాయించాలని,ఆసరా పెన్షన్లను మంజూరు చేయాలని, పట్టణంలో దివ్యాంగులు చిరు వ్యాపారం చేసుకోవడానికి అర్జీ పెట్టుకుంటే మున్సిపల్ అధికారులు స్థలం లేదా షాపులు కేటాయించాలనే తదితర సమస్యల వినతీ పత్రాన్ని దివ్యాంగులు సమర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి జరీనా బేగం, నగరపాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఆర్డీవో నవీన్, అర్భన్ తహశీల్దార్ ఘాన్సీరాం, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్ష,కార్యదర్శులు జగపతిరావు, నస్కంటి నాగభూషణం, కోటేశ్వర్ రెడ్డి,అంజయ్య చారి, తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :