Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ పట్టణంలోని కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న ఎస్సీ, బిసి సంక్షేమ బాలికల వసతి గృహాలను గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ కు వచ్చే విద్యార్థినులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన హాస్టల్ అధికారులను ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలోని మెప్మా కార్యాలయంలో ఆర్పీలకు ఉచితంగా అందిస్తున్న కంప్యూటర్ శిక్షణ సెంటర్ ను , ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా కళాశాలలోని అన్ని తరగతి గదులను తిరిగి పరిశీలించారు. జూనియర్ కళాశాల భవనం కోసం ఆర్ అండ్ బి అధికారులతో సంప్రదించి వెంటనే ఎస్టిమేట్స్ ను తయారు చేయించాలని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ను ఎమ్మెల్యే గారు సందర్శించారు, ఒకేషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులతో ఆయన మాట్లాడారు. సమయం చాలా విలువైనదని , సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. టెక్నికల్ ట్రేడ్ లు చేసిన వారికి ఉపాధి అవకాశాలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ వినోద్ కుమార్, ఐఎన్టీయుసి రాములు యాదవ్, ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవంతాచారి, ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ భగవాణి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News