Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా కేంద్రం, గ్రౌండ్ స్కూల్ విద్యార్థులకు షి టీమ్ పోలీసులు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి మహిళలను, చిన్నపిల్లలను వేధిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా షీ టీం పోలీసులు చెన్నయ్య మాట్లాడుతూ... విద్యార్థులు స్కూల్ నుండి ఇంటికి ఇంటి నుండి స్కూల్ కి వచ్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు ఎవరైనా తినుబండారాలు ఇస్తే తీసుకోరాదని, ఎవరైనా వేధిస్తే విద్యార్థులకు, మహిళలకు షి టీమ్ పోలీసులు అండగా ఉంటారని మహిళలను, శారీరకంగా మానసికంగా బాధపెట్టిన ధైర్యంగా షి టీమ్ పోలీసులకు No. 8712670398 కి సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి చట్ట ప్రకారం వేధించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఒకవేల సైబర్ నేరానికి గురైతే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షీ టీం పోలీసులు బాలరాజు, జ్యోతి, కవిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News