Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : 30 ఏళ్లుగా బైపాస్ పేరిట గత పాలకులు టైంపాస్ చేశారని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ఆశీస్సులతో పట్టణ వాసుల కలను నెరవేర్చామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎదిర చౌరస్తాలో రూ.1.76 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన బైపాస్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. పనులను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు... బైపాస్ రోడ్డు అనేది స్థానికుల కల అని ఆ కలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందని చెప్పారు. ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల బైపాస్ రోడ్డుకు మరింత కల వస్తుందన్నారు. నెల రోజుల్లో సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ మరియు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జడ్చర్ల నుంచి, భూత్పూర్ నుంచి మహబూబ్ నగర్ చేరుకునేందుకు ఫోర్ లేన్ రోడ్లు అందుబాటులో ఉన్నాయని... త్వరలో దివిటిపల్లి నుంచి ఐటీ టవర్ మీదుగా బైపాస్ ద్వారా పట్టణాన్ని చేరుకునేందుకు మరో లేన్ రోడ్డు అందుబాటులోకి వస్తుందన్నారు. ఐటి మరియు ఇండస్ట్రియల్ కారిడార్ ను బైపాస్ తో కనెక్ట్ చేస్తామన్నారు. ప్రస్తుతం బైపాస్ రోడ్డుకు కొనసాగింపుగా క్రిస్టియన్ పల్లి నుంచి పాలమూరు యూనివర్సిటీ మీదుగా చిన్నదర్పల్లి వరకు మరో బైపాస్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. సెంట్రల్ లైటింగ్ తో సహా ప్రస్తుత బైపాస్ రోడ్డుకు ఇరువైపుల ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో జిల్లా కేంద్రంలో అన్ని వైపులా విశాలమైన రోడ్లు అందుబాటులోకి వచ్చి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందిందుకు అవకాశం ఏర్పడిందన్నారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధిగా సాగుతున్నదని ప్రజలంతా అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎదిర చౌరస్తాలో రూ.1.76 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన బైపాస్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. పనులను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు... బైపాస్ రోడ్డు అనేది స్థానికుల కల అని ఆ కలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందని చెప్పారు. ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల బైపాస్ రోడ్డుకు మరింత కల వస్తుందన్నారు. నెల రోజుల్లో సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ మరియు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జడ్చర్ల నుంచి, భూత్పూర్ నుంచి మహబూబ్ నగర్ చేరుకునేందుకు ఫోర్ లేన్ రోడ్లు అందుబాటులో ఉన్నాయని... త్వరలో దివిటిపల్లి నుంచి ఐటీ టవర్ మీదుగా బైపాస్ ద్వారా పట్టణాన్ని చేరుకునేందుకు మరో లేన్ రోడ్డు అందుబాటులోకి వస్తుందన్నారు. ఐటి మరియు ఇండస్ట్రియల్ కారిడార్ ను బైపాస్ తో కనెక్ట్ చేస్తామన్నారు. ప్రస్తుతం బైపాస్ రోడ్డుకు కొనసాగింపుగా క్రిస్టియన్ పల్లి నుంచి పాలమూరు యూనివర్సిటీ మీదుగా చిన్నదర్పల్లి వరకు మరో బైపాస్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. సెంట్రల్ లైటింగ్ తో సహా ప్రస్తుత బైపాస్ రోడ్డుకు ఇరువైపుల ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో జిల్లా కేంద్రంలో అన్ని వైపులా విశాలమైన రోడ్లు అందుబాటులోకి వచ్చి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందిందుకు అవకాశం ఏర్పడిందన్నారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధిగా సాగుతున్నదని ప్రజలంతా అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Admin
Abhi9 News