Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక శిల్పారామంలో వైద్య ఆరోగ్య దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.మహబూబ్ నగర్ మరియు తెలంగాణ వైద్య ఆరోగ్య రంగంలో సాధించిన ప్రగతిని ప్రదర్శించిన డాక్యుమెంటరీలను మంత్రి సహా మిగతా అతిథులు తిలకించారు. జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, కలెక్టర్ జి రవి నాయక్, గ్రంథాలయాల సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, ముడా ఛైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, ఎంపీపీ సుధాశ్రీ, జిల్లా వైద్యాధికారి డా. కృష్ణ, మెడికల్ కళాశాల డైరెక్టర్ డా. రమేష్, జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. రామ్ కిషన్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా జీవన్, వెటర్నరీ జాయింట్ డెరైక్టర్ మధుసూదన్ గౌడ్, డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ ఓ డా. భాస్కర్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ స్వరాజ్యలక్ష్మి, వైద్యాధికారులు డా. శశికాంత్, డా. రఫిక్, డా. ప్రగతి, డా మోతీలాల్, డా. స్వప్న, డా. రాధ, జీజీహెచ్ సభ్యులు సత్యం యాదవ్, లక్ష్మి, మల్లేష్, కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News