Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణ దశాబ్ది దినోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని 10 వ వార్డ్ కు చెందిన మహిళలు తమంతకు తామే అందరూ ఒక చోటుకు చేరి తెలంగాణ వంటకాలు చేసుకొని అక్కడికి వచ్చిన వారికి వడ్డించారు... తెలంగాణ అంతటా సంతోషంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు మేము కూడా తమ వంతుగా భాగస్వాములు అవుదామని వినూత్న రీతిలో తెలంగాణ సాంస్కృతి సంప్రదాయ వంటకాలు చేసుకొని స్టాల్స్ గా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు మహిళలు స్వచ్చందంగా ఒక పండుగ వాతావరణంలో కాలనీ వాసులంతా కలిసి ఒక చోట చేరి స్వచ్చందంగా వంటలు చేసుకొని స్టాల్స్ ఏర్పాటు చేసి దశాబ్ది పండుగ సందర్భంగా అందిరికి పంచడం సంతోష కరమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు
Admin
Abhi9 News