Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : బిజ్వారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఎంపీపీ వై.రాజారెడ్డి పాఠశాల విద్యార్థి విద్యార్థునులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో ఏర్పాటు అయిన ఉచిత బస్ పాస్ లను 109 మంది విద్యార్థి విద్యార్థునులకు ఎంపీపీ వై.రాజారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ వై.రాజారెడ్డి మాట్లాడుతూ... విద్యార్థుల తల్లిదండ్రులకు బస్ పాస్ పట్ల ఆర్థిక భారం పడకూడదనే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో గద్వాల నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల గ్రామాల పాఠశాలలో చదివే సుదూర గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్ లు అందుకోవడం గొప్ప సువర్ణావకాశంగా ఉంటుందని అన్నారు.విద్యార్థులు కష్టపడి చదువుకొని గ్రామానికి తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు మంచిపేరు తీసుకురావాలని అన్నారు. ప్రతిఒక్క విద్యార్థి చదువుతోపాటు క్రమశిక్షణతో మెలుగుతూ ఉపాధ్యాయులను తల్లిదండ్రులను గౌరవిస్తూ సమాజ అభివృద్ధికి సహకరించగలరని కోరడం జరిగింది జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ కి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వుంటాయని ఎంపీపీ వై.రాజారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి.లక్ష్మన్న,గద్వాల ఆర్టీసీ సిబ్బంది,పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News