Abhi9 News - తెలంగాణ / వనపర్తి : తేదీ 29. 01. 2016 రోజున వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది రాత్రి గస్తీ నిర్వహించుచుండగా కొత్తకోట రోడ్డు నందు నాగమ్మ తండా దగ్గర ఉదయం 5 గంటలకు ఒక లారీని ఆపి చెక్ చేయగా అందులో ఇసుకతో నింపుకొని ఉన్న లారీకి ఎలాంటి అనుమతులు లేవు మేము అక్రమంగా ఇసుక తరలిస్తున్నమని వనపర్తికి తీసుకొని వస్తున్నాము అని డ్రైవర్ తెలియజేసినాడు. లోకముని ఇంద్రయ్య మా ఓనరు లోకమోని కురుమూర్తి అని చెప్పినాడు అట్టి ఫిర్యాదు పై అప్పటి వనపర్తి రూరల్ ఎస్సై ఎస్ఐ నాగ శేఖర్ రెడ్డి కేసు నెంబర్ 08/ 2016 అండర్ సెక్షన్ 379 ఐపిసి సెక్షన్ 21 క్లాస్ 1 మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ 1957 అండ్ సెక్షన్ 3 ఆఫ్ పి డి పి ఆక్ట్ గా కేసు నమోదు చేసి నేరస్తులు అయిన A1 ఇంద్రయ్య A2 లోకమోని కురుమూర్తి లపై చార్జి సీటు ఫైలు చెయ్యగా విచారణ నిమిత్తము సాక్షులను వనపర్తి 2 జుడీసీఎల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు 6 మంది సాక్షులను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీతాదేవి వాదనలను వినిపించినారు అట్టి సాక్షుల వాదోపవాదాలు విన్న తరువాత జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ సెకండ్ అడిషనల్ JFCM జానకి గారు విచారణ నిమిత్తము కేసు రుజువు కావడంతోనిందితులకు ఆరు నెలలు జైలు శిక్ష విధించారు.తేదీ 09. 02 2016 రోజున ఇట్టి ఇసుక లారీని వనపర్తి రూరల్ ఎస్సై నాగ శేఖర్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జువాలజీ (విజిలెన్స్) జడ్చర్ల వారికి లారీని అప్పచెప్పగా ఆ లారీలో గల ఇసుకకు డిపార్ట్మెంట్ వారు 50వేల జరిమాన విధించినారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రక్షిత మూర్తి ఇట్టి కేసులో నిందితునికి శిక్ష పడడంలో బాగా పనిచేసిన వనపర్తి సెకండ్ అడిషనల్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి సునీతా దేవి వనపర్తి సీఐ మహేశ్వర్ , , ఎస్సై నాగన్న , కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ రాజేందర్ లను ఎస్పీ అభినందించారు త్వరలో రివార్డు అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు...
Admin
Abhi9 News