Abhi9 News - తెలంగాణ / Hyderabad : జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, మహబూబ్ నగర్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ మరియు చైర్మన్ కం జిల్లా జడ్జి ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మహబూబ్ నగర్ ఇంచార్జి జిల్లా కార్యదర్శి శ్రీమతి డి.ఇందిరా ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల/కళాశాల" లో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ అంధుల గౌరవాన్ని కాపాడుటకు కొరకు వారికి సంబందించిన చట్టాలు మరియు హక్కులు ఉన్నాయని మరియు వాటి గురించి కూడా తెలియచేసినారు. సమాజంలో చూపు లేని వారి పట్ల చిన్న చూపు వద్దు అని వారికి చేయుతను ఇస్తే అన్ని రంగాలలో వారు కూడా ప్రయోజకులుగా ఉంటారు అని అన్నారు. టీచర్స్ అంధుల విద్యార్థులకు ప్రత్యేక విద్యను మరియు శిక్షణను ఇస్తూ వారి పట్ల శ్రద్ద వహించాలి అని వారిని అన్ని రంగాలలో విజయం సాధించే విధంగా ప్రోత్సహించాలి అని తెలియజేసినారు. ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులు చాలా అభివృద్ధి చెందుతున్నారు అని ఇంకా ఇతర స్కిల్ డేవెలప్మెంట్ ఆక్టివిటీస్ లో కూడా మంచి నైపుణ్యన్నీ కలిగి ఉండాలని తెలియచేసినారు మరియు దివ్యంగులకు ముఖ్యంగా మానసిక,చెవిటి, మూగ, అంధత్వం ఉన్న దివ్యంగులకు వారి వారి పనులను వారే చేసుకునే విధంగా కృషి చేయాలని అన్నారు. వారి హక్కులకు గాని, గౌరవానికి గాని ఎలాంటి సమస్యలు ఉన్నా వారి హక్కుల ద్వారా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కు దృష్టికి తిసుకువచ్చి నట్లయితే మీకు తగిన విధంగా ఉచిత న్యాయ సహాయ సహకారాలు అందిస్తామని అంధుల విద్యార్థులకు మరియు టీచర్స్ కు తెలియచేసరు. చైల్డ్ మ్యారేజ్ ఆక్ట్ గురించి , చైల్డ్ రైట్స్ గురించి, లీగల్ సర్వీసెస్ ఆక్ట్ , ఫొక్సో ఆక్ట్ గురించి మాట్లాడరు. ఇతర చట్టాలపై కూడా అవగాహన కల్పించినారు. వారికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ అవగాహనా సదస్సులో ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ రాములు , పార లీగల్ వాలంటీర్ చంద్రశేఖర్ , పాఠశాల బృందం తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News