Abhi9 News - తెలంగాణ / వనపర్తి : పానగల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్.పి శ్రీమతి రక్షిత కె మూర్తి, ఐ.పి.యెస్...ఈ రోజు జిల్లా ఎస్.పి శ్రీమతి రక్షిత కె మూర్తి, ఐ.పి.యెస్ పానగల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అక్కడి పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను ఎస్సై ఎస్పీ గారికి వివరించారు. అనంతరం ఎస్పీ అక్కడి అధికారులకు పలు సూచనలు చేస్తూ ప్రతి రోజు పోలీస్ స్టేషను పరిశుభ్రంగా ఉంచాలని, విధుల పట్ల అంకితభావంగా ఉండాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. న్యాయబద్ధంగా చట్టాన్ని అమలు చేయడం పోలీసుల బాధ్యత అని ముందుగా చట్టాలను స్వయంగా పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. పోలీస్ స్టేషన్ లోని వర్టికల్స్ నిర్వహణ, HRMS. ఆన్ లైన్ వినియోగించు విధానము, TS COPs, CCTNS ఆన్లైన్లో కేసుల వివరాలు నమోదు చేయు మొదలగు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ వచ్చే ప్రతి పిటిషన్ ను ఆన్లైన్లో నమోదు చేయాలని, సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని మరియు డయల్100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు వారిని తనిఖీ చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు పెండింగ్లో ఉంచరాదని, వారితో మర్యాద మెలుగలని సూచించారు. వాహనాల సంబందించిన ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ కలిగి ఉండాలి అన్నారు. అలాగే ప్రతి వాహనదారుడు అతివేగంగా వాహనాలను నడపవద్దని ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యస్ ఐ రవిప్రకాష్, మరియు సిబ్బంది ఉన్నారు.
Admin
Abhi9 News