Saturday, 18 April 2026 06:47:28 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

అధికారులు ఇసుక సీజ్ చేస్తే.. మేము తరలిస్తామంటున్న ఇసుక మాఫియా

కృష్ణ మండల పరిధిలోని కాన్ దొడ్డి శివారులో ఉన్న అంజప్ప ఇటుక బట్టీలో లింగప్ప అనే వ్యక్తి రెండు ట్రిప్పర్లతో ఇసుక డంపు చేశాడు. ఈ విషయం రెవెన్యూ సిబ్బంది

Date : 23 September 2025 07:32 PM Views : 228

Abhi9 News - తెలంగాణ / Hyderabad : అధికారులు ఇసుక సీజ్ చేస్తే.. ఇసుక మేము తరలిస్తామంటూ ఇసుక మాఫియా రెచ్చిపోతున్న సంఘటన కృష్ణ మండల పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సాధారణంగా ఇసుక అక్రమ రవాణా చేసి డంపులు చేస్తే రెవెన్యూ అధికారులు వాటిని సీజ్ చేసి ఇసుకకు వేలం వేసి, వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖాతాలో జమచేస్తారు. ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ. అయితే దీనికి విరుద్ధంగా కృష్ణ మండల పరిధిలోని కాన్ దొడ్డి శివారులో ఉన్న అంజప్ప ఇటుక బట్టీలో లింగప్ప అనే వ్యక్తి రెండు ట్రిప్పర్లతో ఇసుక డంపు చేశాడు. ఈ విషయం రెవెన్యూ సిబ్బంది దృష్టికి వెళ్లడంతో ఆర్ఐ శ్రీనివాస్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని ఇసుక డంపులు సీజ్ చేశాడు. అయితే ఎవరైతే ఇసుక డంపు చేశారో వారిని కృష్ణ తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించుకొని ఇసుక డంపు తీసుకెళ్లాలంటే 50వేల రూపాయలు ఫైన్ కట్టి ఇసుక తీసుకెళ్లాలని తాసిల్దార్ సూచించారు. అయితే ఇసుక మాఫియా మాత్రం రాత్రికి రాత్రి సీజ్ చేసిన ఇసుకను ట్రిప్పర్ల ద్వారా ఇసుక తరలించి మీరు సీజ్ చేస్తే మేము ఇసుక తీసుకెళ్లలేమా అంటూ రెవెన్యూ సిబ్బందికి సవాలు విసురుతున్నారు. ఈ విషయంలో కృష్ణ రెవెన్యూ సిబ్బంది హస్తంతోనే అక్రమ ఇసుక తరలించారని పలువురు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కృష్ణ తహసీల్దార్ శ్రీనివాసులును పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :