Saturday, 13 June 2026 05:20:46 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

పోలీసులు అప్రమత్తం.. ప్రజలకు కీలక సూచన

నకిలీ యాప్‌ల ద్వారా బాధితులుగా మారుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు.

Date : 20 October 2025 10:31 AM Views : 213

Abhi9 News - తెలంగాణ / Hyderabad : సైబర్ నేరాల నియంత్రణకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. కానీ ఈ నేరాల బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అలాగే భారీగా లోన్ యాప్‌లు సైతం పెరిగాయి. వీటిలో అసలు ఏదో.. నకిలీది ఏదో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. అన్ని ఇన్‌స్టాంట్‌ లోన్ యాప్స్ సురక్షితం కాదని స్పష్టం చేసింది. సులభంగా లోన్ వస్తుందంటే.. నమ్మొద్దని సూచించింది. ఒక్క లింక్ క్లిక్‌ చేస్తే.. లోన్ వస్తుందనేది అబద్ధమని తెలిపింది. రుణం కోసం కనిపించిన యాప్స్ అన్నీ డౌన్ లోడ్ చేయవద్దని పేర్కొంది. ఏపీకే ఫైల్స్‌ను అసలు ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయొద్దని వివరించింది. యాప్స్‌కు మీ మొబైల్‌లో అసలు అనుమతి ఇవ్వవద్దంది. లోన్ కంటే మీ వ్యక్తిగత డేటా చాలా ముఖ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని తెలంగాణ పోలీసులు కీలక సూచన చేసింది. మరోవైపు సైబర్ నేరగాళ్లు అనేక నకిలీ యాప్‌ల ద్వారా రుణాల పేరుతో ఆకర్షిస్తున్నారు. నకిలీ వెబ్ సైట్లు, సోషల్ మీడియా ప్రకటనలు, ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతారు. వెంటనే లోన్ ఆమోదం, స్వల్ప వడ్డీ రేట్ల పేరుతో వల వేస్తారు. రుణం ఆమోదం కోసం ముందుగా కొంత చెల్లించాలని చెబుతారు. అలా నగదు దోచుకుంటారు. లేకుంటే లోన్ తీసుకునే వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు. అలా లోన్ తీసుకున్న వారు.. ఆ తర్వాత నుంచి వివిధ మార్గాల్లో వేధింపులకు గురవుతారు. తీసుకున్న లోన్ చెల్లించిన సరే.. ఇంకా చెల్లించాల్సిన నగదు బకాయిలుగా ఉందంటూ ఒత్తిడి చేస్తారు. దీంతో తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక లోన్ తీసుకున్న వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికమయ్యాయి. ఇలా బాధితులుగా మారిన వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు.. ప్రజలకు ఈ కీలక సూచనలు చేశారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :