Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : లాంగ్ పెండింగ్ లో వున్న గ్రేవ్, నాన్ గ్రావ్ మరియు పీటీ కేసులగురించి తెలుసుకోని వాటిని త్వరితగతిన పూర్తిచేయమని జిల్లా ఎస్పీ కె. నరసింహ అధికారులను ఆదేశించారు... మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ సిబ్బందికి నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు... ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయనీ ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి త్వరిత గతిన నివారణ చర్యలు చేపట్టామన్నారు... ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న ప్రతి గ్రామాన్ని సందర్శించి, గ్రామ సర్పంచిలు మరియు గ్రామ పెద్దలతో సమావేశామై సీసీ కెమరాలు అమర్చు కోవాలని అమర్చుకుంటే వాటివల్ల లాభాలాలను తెలియజేసి ప్రజలందరికి అవగాహన కల్పించాలన్నారు... పోలీస్ స్టేషన్ నందు వచ్చిన దరఖాస్తుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారికి త్వరగా న్యాయం జరిగేటట్లుచూడాలన్నారు. వర్షాకాలం కావున వాగులలో చెరువుల దగ్గర నీరు ప్రవహిస్తున్నపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ సూచించారు... ప్రతి పోలీస్ స్టేషన్ పరిధి నందు ప్రజలందరికీ సైబర్ క్రైమ్ నేరాల గురించి అవగాహన కల్పించమని చెప్పారు...
Admin
Abhi9 News