Abhi9 News - తెలంగాణ / రంగారెడ్డి : పట్టణాల్లో అండర్ డ్రైనేజీలతో వార్డులు పరిశుభ్రంగా మారుతాయని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ లో రెండో వార్డులో కౌన్సిలర్ చంద్రకళ రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో అండర్ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్,మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.రూ. 5 లక్షల మున్సిపాలిటీ విధులతో ఈ అండర్ డ్రైనేజీని నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ..పట్టణంలోని అన్ని వార్డులలో అండర్ డ్రైనేజీల పనులు వేగవంతం చేశామని తెలిపారు.సీఎం కేసీఆర్,మున్సిపల్ మంత్రి, కేటీఆర్ పరిశుభ్రతకు అధిక ప్రాముఖ్యతనిస్తున్నారని ఆయన వివరించారు. త్వరలోనే కొత్తూరు మున్సిపాలిటీ రూపురేఖలు మారనున్నాయని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వీరేందర్, వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, ఎంపీటీసీ రాజేందర్ గౌడ్, మాజీ సర్పంచ్ ఏనుగు జనార్దన్ రెడ్డి, నరేందర్, బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News