Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : అన్ని వర్గాల ప్రజలకు చట్టసభల్లో సమన్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వలననే సాధ్యం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ పట్టణం లోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బర్త్ డే కేక్ ను కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ రాహుల్ గాంధీ ఆదేశానుసారం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేయించి బిసిలకు 42% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లో చట్టం చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటివరకు రాజ్యాంగం లోని 9 వ షెడ్యూల్ లో పొందుపరచలేదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, టి పిసిసి ప్రధాన కార్యదర్శులు సంజీవ్ ముదిరాజ్, మిథున్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, టి పిసిసి అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, ఎన్ పి వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, వేముల కృష్ణయ్య, ఎస్సీ సెల్ చైర్మన్ సాయి బాబా, ఐఎన్టీయుసి రాములు యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వసంత, గంజి ఆంజనేయులు, నాయకులు ఫయాజ్ ,అజ్మత్ అలి, అవేజ్, నవనీత, ఎస్సీ , ఎస్టీ, ముదిరాజ్ , గౌడ, యాదవ కుల సంఘాలు, మహిళా సంఘాల సభ్యులు, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు , మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News