Saturday, 18 April 2026 06:51:59 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఎర్రశేఖర్ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి & ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్

Date : 14 October 2025 07:51 PM Views : 527

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖరు తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకుంటున్నారన్న సమాచారం పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి & ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ ఒక ప్రకటనలలో తీవ్రంగా ఖండించారు. ఫ్యాక్షనిస్ట్ అంటూ సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని చంపిన వ్యక్తి అని సంచులు మోసే వాళ్లు మా పార్టీకి అక్కరలేదంటూ రకరకాల అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీలో చాలామంది రెడ్డిలు మాత్రమే ఫ్యాక్షనిస్టులు ఉన్నారని వారు రాయలసీమ ప్రాంతంలో చూశామని తెలంగాణలో ఇటువంటి సంస్కృతికి తావు లేదని కానీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎర్ర శేఖర్ ను ఇలాంటి దుర్భాషలవడం తగదని రాజకీయాలను రాజకీయంగా చూసుకోవాలని కానీ వ్యక్తిగత విషయాలతో సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఎమ్మెల్యే మాట్లాడడం విడ్డూరంగా ఉందని కోర్టులు, చట్టాలు తమ పని తాము చేస్తాయని ఆయన అన్నారు. బీసీల ఎదుగుదలను చూడలేని అగ్రవర్ణ ఎమ్మెల్యే , భవిష్యత్తులో తనకు ఎక్కడ పోటీ అవుతాడని భయంతో ఇలా మాట్లాడుతున్నాడని ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ భావజాల వ్యాప్తి బలంగా ఉన్నందున రేపు జరగబోవు ఏ ఎన్నికలైనా బీసీలే గెలవడం ఖాయమని శ్రీనివాస్ సాగర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కడి సొంతం కాదని అధిష్టానం అన్ని రకాలుగా ఆలోచించే సరైన నిర్ణయం తీసుకుంటుందని మీరు ముందే భయపడి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడుతుంటే బీసీ సమాజం చూస్తూ ఊరుకునే పరిస్థితులో లేదని సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతామని భవిష్యత్తులో మళ్లీ ఇటువంటి మాటలు, భాషను ఉపయోగిస్తే బీసీ సమాజం మొత్తం నిన్ను రాజకీయంగా ఎదుగుదల లేకుండా చేస్తామన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :