Tuesday, 06 January 2026 09:14:54 PM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

ప్రతీ గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో పల్లె ప్రకృతి వనాలు..అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం

Date : 15 June 2023 11:51 AM Views : 324

Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని అలంపూర్ శాసనసభ్యులు డా వి.యం.అబ్రహం తెలిపారు ఈరోజు ఐజ మండలం "సంకపురం ,ఈడిగొని పల్లి ఉప్పల క్యాంప్ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా "పల్లె ప్రగతి" దినోత్సవ వేడుకల్లో భాగంగా 20 లక్షల రూపాయలతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను భూమి పూజ చేసారు అనంతరం ఈడిగొని పల్లి గ్రామంలో వాల్మీకి మహర్షి మరియు బీరప్ప స్వామి ఆలయల నిర్మాణ పనులకు భూమి పూజ చేసారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి గ్రామపంచాయతి భవనం వ్యవస్థ నాంది అని, గ్రామనికి నూతన సచివాలయం చాల అవసరం అని ప్రతి గ్రామనికి నూతన గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేయడం జరిగిందన్నారు.నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నాని తెలిపారు .ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పల్లెలన్నీ క్రమక్రమంగా ప్రగతి పథంలో పయనిస్తున్నాయని,గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని, గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు వీలుగా చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను మంజూరు చేయడంతో పాటు డంపింగ్ యార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, గ్రామస్తులకు మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన జలాలను సరఫరా చేస్తున్నామని అని ఆయన తెలిపారు. ప్రతీ గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో పల్లె ప్రకృతి వనాలు, అంతిమ సంస్కారాల కోసం వైకుంఠ ధామాలను ప్రభుత్వం నిర్మించిన ఏకైక రాష్ట్రము తెలంగాణ అని అన్నారు. ప్రతీ నెల పల్లె ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు.రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యకలాపాల పనితీరు మెరుగు, పర్యవేక్షణ చేస్తున్నామని,సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పకడ్బందీగా అమలవుతున్నాయని అన్నారు. ప్రపంచ దేశాలను కరోనా కబళించినప్పటికీ స్వరాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకం నిధుల కొరతతో నిలిచిపోలేదని అన్నారు. జాతిపిత గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కేసీఆర్ సర్కార్ సాకారం చేస్తున్నదని అన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి సరిపడ నిధులను ప్రభుత్వం ఎప్పటికప్పుడూ విడుదల చేస్తున్నదని అన్నారు. రైతు మృతిచెందితే అతడి కుటుంబం రోడ్డునపడే దుస్థితి నెలకొనవద్దనే ఉద్దేశంతో రైతు బీమా పథకం ద్వారా నామినీకి రూ.5లక్షల చెక్కును ప్రభుత్వం అందజేస్తోందన్నారు. వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ చేపట్టిన విప్లవాత్మక మార్పుల కారణంగా రైతులు సగర్వంగా తలెత్తుకొని జీవిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల బలవన్మరణాల దాఖలాల్లేవని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు మాజీ ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు మరియు BRS పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :