Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : వార్షిక తనిఖీలలో భాగంగా ఈ రోజు శుక్రవారం నాడు జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ బాలానగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది విధులు, స్టేషన్ రికార్డ్స్ లను తనిఖీలు చేసి పోలీస్ స్టేషన్ పరిసరప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకొని సర్వీస్ కు సంబంధించిన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు మరియు ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క వివరాలు, వారు నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్టికల్ వారిగా అధికారులు సిబ్బంది విధులు నిర్వహించాలని ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని ఫిర్యాదుదారులందరికీ ఒకే రకమైన సేవలు అందించాలని సూచించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ , అధికారులు, సిబ్బంది ప్రజలతో సత్సంబంధాలు మరింత పెంపొందించుకుని శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. రోజు వారి DD, ఈ పెట్టీ కేసుల నమోదు శాతాన్ని పెంచాలని అన్నారు. తరచూ ప్రాపర్టీ, మానవ సంబంధ నేరాలకు తరచూ పాల్పడే వారి పై సస్పెక్ట్, రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలని, స్టేషన్ రికార్డ్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని, ఇసుక, PDS రైస్ అక్రమ రవాణా పై పూర్తి నిఘా ఉంచి నియంత్రించాలని , విజిబుల్ పోలీసింగ్ ను పెంచాలని, NH-44 మీద చాలా వాహనాలు రాకపోకలు జరుగుతుంటాయి ఎల్లప్పుడూ అప్రమతంగా ఉండాలని సూచించారు. ప్రతిరోజు పోలీసు అధికారులు సిబ్బంది సమయం దొరికినప్పుడు వ్యాయామం, యోగ, ధ్యానం, వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నీట్ టర్న్ అవుట్ కలిగి ఉండి, మంచి క్రమశిక్షణ సమయపాలన పాటించాలని లీడర్షిప్ లక్షణాలు కలిగి ఉండాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో 5s ఇంప్లిమెంటేషన్ ని పరిశీలించి ఫైలు సక్రమమైన పద్ధతిలో ఉంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏ తరహా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి అడిగి తెలుసుకున్నారు, గత మూడు సంవత్సరాల నుండి నమోదవుతున్న కేసుల గురించి కంపారిటివ్ స్టేట్మెంట్ ను పరిశీలించి, మరియు అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను, గ్రేవ్ కేసెస్ లలో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు. రౌడీలు, కేడీలు, సస్పెక్ట్స్ మరియు సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచి, వారి కదలికలను గమనించాలని తెలిపారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు పాత నేరస్తులను తనిఖీ చేయాలని ఎస్సై గారికి సూచించారు. విధినిర్వహణలో రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని సూచించారు. ప్రజల రక్షణ గురించి ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ మరియు పరదర్శక ఇంస్టిగేషన్ ఉండాలని కేసులలో శిక్షల శాతం పెంచాలని సూచించారు. అధికారులు సిబ్బంది ప్రొయాక్టివ్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో DSP మహేష్, DCRB DSP రమణ రెడ్డి, జడ్చర్ల రూరల్ CI జమ్ములప్ప , బాలానగర్ SIs శ్రీనివాసులు, Jayaprasad మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Abhi9 News