Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఉర్దూ మీడియం పాఠశాల యందు తెలంగాణ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యా దినోత్సవం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముందుగా, మరికల్ గ్రామ పురవీధుల గుండా ర్యాలీగా విద్యార్థులు వెళ్లి తెలంగాణ ఆవశ్యకత గురించి గేయాలు ఆలపిస్తూ తరువాత, జాతీయ జెండా ఆవిష్కరణ జరుపుకొని అనంతరం సమావేశం ఏర్పరచుకొని విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకతను ప్రధాన ఉపాధ్యాయులు ఎం పీ పీ ఎస్ ఉర్దూ మీడియం మహమ్మద్ ఇస్మాయిల్ విద్యార్థులకు వివరించారు . తర్వాత విద్యార్థులకు ఈ రోజు నుండి ఉదయం సమయంలో రాగి అంబలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సందర్భంగా, దీనిని ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జెడ్ పి హెచ్ ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు, ఎంపీపీ ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు మహమ్మద్ ఇస్మాయిల్, మహమ్మద్ హన్నన్ ,మరియు గ్రామ యువకులు, పెద్దలు, విద్యార్థిని విద్యార్థులు, పాల్గొన్నారు.
Admin
Abhi9 News